ఎన్‌.గోపి సాహిత్యానుశీలనం

Home>> Telugu>> >> ఎన్‌.గోపి సాహిత్యానుశీలనం
 ఎన్‌.గోపి  సాహిత్యానుశీలనం
ఎన్‌.గోపి సాహిత్యానుశీలనం
by రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
110
About Book

ఎన్‌.గోపి కవి, విమర్శకుడు, పరిశోధకుడు, ఆచార్యుడు. 'తంగెడుపూలు' నుండి 'జీవనభాష' దాకా ఇరవైమూడు కావ్యాలు ప్రచురించారు. 'జలగీతం' ఆయన ఇతిహాసం. ఆయన కావ్యాలు ఇరవైమూడు భాషలలోకి అనువాదమయ్యాయి. గోపి నిరంతర కవి. చీమ నుండి హిమాలయపర్వతం దాకా ఆయన కవిత్వవస్తువులయ్యాయి. తెలంగాణ నుండి సైప్రస్‌ దాకా ఆయన కవిత్వం ప్రయాణించింది. సాహిత్య అకాడమీ వంటి అనేక సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ఉస్మానియా తెలుగు శాఖాధ్యక్షుల నుండి తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుల దాకా అనేక పదవులు నిర్వహించారు. వేమనను విశ్వవిద్యాలయ మెట్లెక్కించి వేమన గోపి అయ్యారు. 'నానీలు'ను సృష్టించి ప్రయోగాన్ని సంప్రదాయం చేశారు. సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సంఘసభ్యులుగా, తెలుగు సలహామండలి కన్వీనర్‌గా ఉన్నారు.

రాచపాళెం చంద్రశేఖరరెడ్డి సాహిత్య విమర్శకుడు, కవి, పరిశోధకుడు, ఆచార్యుడు. 'శిల్పప్రభావతి' నుండి ఎన్‌.గోపి సాహిత్యానుశీలనం దాకా ఇరవై విమర్శ గ్రంథాలు ప్రచురించారు. నన్నయ్య నుండి నవీన్‌ దాకా అనేక మంది ప్రాచీనాధునిక రచయితల మీద విమర్శలు రాశారు. ఆయన నిరంతర విమర్శకులు. మూల్యాంకనం, పునర్మూల్యాంకనం ఆయన విమర్శవిధానాలు. అనంతపురం జిల్లా రచయితల సంఘం నుండి అభ్యుదయ రచయితల సంఘం దాకా, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షుల నుండి సిపి బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్ర బాధ్యతల దాకా అనేక బాధ్యతలు నిర్వహించారు. విశాలాంధ్ర, సాహిత్య అకాడమీ వంటి సంస్థల నుండి పురస్కారాలందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అధికారభాషా సంఘసభ్యులుగా పనిచేశారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి సభ్యులుగా ఉన్నారు.

 

Title ఎన్‌.గోపి సాహిత్యానుశీలనం
Author:
రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
Language:
Telugu
No of pages:
160
Publisher:
prajasakti book house
Similar books
₹ 100