టీచర్‌ చెప్పిన కథలు

Home>> Telugu>> బాలసాహిత్యం >> టీచర్‌ చెప్పిన కథలు
టీచర్‌ చెప్పిన కథలు
టీచర్‌ చెప్పిన కథలు
by డా|| ఎం. హరికిషన్‌
70
About Book

తెలుగు బాలసాహిత్యంలో ఒక నూతన ఒరవడికి కృషిచేస్తున్న ప్రముఖ రచయిత డా|| ఎం. హరికిషన్‌. వీరు పిల్లలు మాట్లాడుకునే భాషలో అత్యంత సరళంగా, పిల్లలు తమంతట తామే చదవుకొనేలా కథలు రాయడంలో సిద్ధహస్తులు. గత పది సంవత్సరాలుగా కర్నూలు జిల్లాలో అంతరించిపోతున్న జానపద బాల సాహిత్యాన్ని వెలికితీస్తూ ''రింగురుబిళ్ళ, కిర్రు కిర్రు లొడ్డప్ప ఒకటి తిందునా... రెండు తిందునా, నక్కబావ-పిల్లిబావ. నల్లకుక్క, నలుగురు మూర్ఖులు, కోటకొండ మొనగాడు...'' ఇలా అనేక పుస్తకాలు వెలువరించారు. అప్పుడప్పుడే అక్షరాలు దిద్దుతూ, చదవడం నేర్చుకుంటున్న చిన్నారుల కోసం ఏమయినా చేయాలనే తపనతో ''ఒత్తులు లేని గేయాలు, బొమ్మలతో సామెతలు, పిల్లల గేయాలు, సంయుక్త అక్షరాలు లేని కథలు'' సృష్టించారు.

వీరు 'కేతు విశ్వనాథ రెడ్డి కథలు - సామాజిక దర్శనం' అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టాను పొందారు. కర్నూలు జిల్లాలో వున్న కథకులను, వారి కథలను సాహితీ లోకానికి పరిచయం చేసిన బృహత్‌ సంకలనం ''కర్నూలు కథ'' వీరి సంపాదకత్వంలోనే వెలువడింది. వీరు బాలసాహిత్యాన్నే గాక సామాజిక స్పృహ గలిగిన ఇతర రచనలు గూడా అనేకం చేశారు. ''మాయమ్మ రాచ్చసి. నయాఫత్వా, నేనూ మాయమ్మ, 3 అబద్ధాలు'' వీరి సామాజిక నిబద్ధతను తెలియజేసే ఇతర కథా సంపుటాలు.

 

Title టీచర్‌ చెప్పిన కథలు
Author:
డా|| ఎం. హరికిషన్‌
Language:
Telugu
Publisher:
prajasakti book house
Similar books