వి.ఆర్‌. బొమ్మారెడ్డి జ్ఞాపకాలు అనుభవాలు

Home>> Telugu>> >> వి.ఆర్‌. బొమ్మారెడ్డి జ్ఞాపకాలు అనుభవాలు
వి.ఆర్‌. బొమ్మారెడ్డి జ్ఞాపకాలు అనుభవాలు
by
90
About Book

బొమ్మారెడ్డిగారిలో ఒక సంస్కర్త కూడా వుండేవారు.విశాల హృదయంతో ఆధునిక మనస్తత్వంతో సంచరించేవారు. కనుకనే సంస్కరణ వివాహాలకు ఆచార్యులుగా ఐఎస్‌ఐ ముద్రగా పేరొందారు.బొమ్మారెడ్డి గారు సిపిఎంలో అత్యధిక వివాహకర్త. మా పెళ్లితోసహా ఎన్ని చేశారో లోపల జాబితా చూడొచ్చు. అందుకే ఏ వూరికి వెళ్లినా అక్కడ ఆయన పెళ్లిచేసిన జంటలుండేవి. తమ కుటుంబంలోనూ అదే వరవడి పాటించానని సంతృప్తిగా రాసుకున్నారు. కుటుంబ సభ్యులందరూ నాటి నుంచి ఈ నాటి శతజయంతి వరకూ ఆయన ఆశయాలను గౌరవిస్తూ సహకరిస్తూ రావడం అభినందనీయం. అయితే బొమ్మారెడ్డిగారి పాత్రికేయ కుటుంబం చాలా పెద్దది. ఆయన పాత్రికేయ పితామహుడు. మహదాశయ ధనుడు. ఘనుడు. ఇంత సార్థక జీవితం గడిపారు గనకే 2006 అక్టోబరు 13న ఆయన కన్నుమూసినప్పుడు  అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో సహా రాజకీయాలకు అతీతంగా అందరూ నివాళులర్పించారు.

       యావజ్జీవితం ప్రజాశక్తికి ప్రజా ూద్యమాలకు అంకితం చేసిన ఆ మహనీయునికిదే పజాశక్తి అక్షరాంజలి. శతజయంతి అరుణాంజలి.

 

Title వి.ఆర్‌. బొమ్మారెడ్డి జ్ఞాపకాలు అనుభవాలు
Language:
Telugu
No of pages:
128
Publisher:
Prajasakti Book Hosue
Similar books
₹ 100