నేనెప్పుడూ కమ్యూనిజానికే సొంతం ఆరుద్ర

175.00

Pages – 136

గొప్పకవి, ఆధునిక తెలుగు సాహిత్యంలో అసమాన పండిత పరిశోధకుడూ ఆరుద్ర శతజయంతి కానుక ఇది. ఏ పట్టుదల అవగాహన ఆయనను అంత సమున్నతుణ్ని చేశాయి? ‘నా జీవితం కమ్యూనిజానికే సొంతం’ అని సగర్వంగా ప్రకటించిన ఆరుద్రకు ఆ విశిష్టత ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు ఆయన మాటల్లోనే సమాధానం ఇచ్చే రచన ఇది. అంతర్జాతీయంగా సోవియట్‌ విచ్చిన్నం ప్రపంచీకరణ, దేశంలో అయోధ్య వివాదం తర్వాత మతతత్వ రాజకీయాలు పెరుగుతున్న తరుణంలో నిరుత్సాహపడిన చాలా మందితో పోలిస్తే ఆరుద్ర మరింత పట్టుదలగానూ అధ్యయన శీలంగానూ గడిపారు.
ఆరుద్ర 1998 జూలై 4న కన్నుమూసిన సంగతి అంత్యక్రియలు ముగిశాక బయిట ప్రపంచానికి తెలిసిందంటే అది కూడా ఆయన నిరాడంబరతకు ఓ నిదర్శనమే. చరిత్రనే తిరగదోడేలా సంఘ పరివార్‌ దాడులు, సమిష్టి ప్రయోజనం కన్నా వ్యక్తిగత ధోరణులు, వాణిజ్య ప్రభావాలు పెంచుతున్న ఈ తరుణంలో ఆరుద్ర జీవిత ప్రస్థానం జిజ్ఞాసుల, చైతన్యగత ప్రాణుల అధ్యయనానికి మార్గదర్శకం. అన్ని అవకాశాలు వుండి కూడా ఉద్యమంతో మమేకం కావాలని పరితపించిన ఆరుద్ర జీవితం కృషి ఆదర్శప్రాయం. శతజయంతి సంవత్సరంలో ఆరుద్ర సాహిత్యం అధ్యయనాల వారసత్వాలను సంస్మరించుకుందాం.
–  తెలకపల్లి రవి

Reviews

There are no reviews yet.

Be the first to review “నేనెప్పుడూ కమ్యూనిజానికే సొంతం ఆరుద్ర”

Your email address will not be published. Required fields are marked *