మీరే ప్రేరణ మీదే సాధన (విలువలతో వినూత్న వికాసం)
₹180.00
– తెలకపల్లి రవి
Pages – 144
విజయ సాధన సూత్రాలపై నిరంతరం పుస్తకాలు వెలువడుతున్నా కోట్లాది మందిని వెతలు వెన్నాడుతూనే వున్నాయేల? ఆర్థికం, సామాజికం, సాంస్కృతికం, నైతికం, ఆధ్మాత్మికం ఇలా పలువ్యవస్థల మధ్య మానవ అవసరాలు, ఆసక్తి ఎలాటి ప్రభావం చూపిస్తాయి? వచ్చే మార్పులను అన్వయించుకుంటూ అర్థవంతంగా జీవించడమెలా? మంచిని సాధించడమెలా? మనుషులు, కుటుంబాలు, బంధుమిత్రులు, సమాజాలు, వ్యవస్థలు, దేశాలు, ప్రపంచం, ప్రచారాలు వీటిమధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడమెలా? నిత్యం ఎదురయ్యే సంధిగ్ధతలూ, సంఘర్షణలూ, సవాళ్ళతో మనుషుల గమనాన్ని నిర్దేశించే అంశాలేవి?
విజయం., పరాజయం ఏదీ శాశ్వతమైనది కాదు. విజయాన్ని కాపాడుకోకుంటే అపజయం. అపజయాన్ని ఎదుర్కొగలిగితే విజయం. ప్రయాణం విరమించనంతవరకూ లక్ష్యసాధనలో ముందుకు సాగుతున్నట్టే ఈ క్రమంలోనే అనేక మలుపులు, మజిలీలు, పోరాటాలు, పొందికలు, పోలికలు, పాఠాలు… గమనం సాగుతూ వుండాల్సిందే.
ఎవరికైనా ఎప్పుడైనా జీవితం బహువచనమే. మనుషులనూ, సమాజాలనూ అర్థం చేసుకుంటూ సరైన గమ్యాన్ని నిర్దేశించుకుంటూ ఆ దిశలో మనమేం చేయాలో తేల్చుకోవాల్సిందే. ఆ ప్రయాణంలో ప్రేరణ సాధన అన్నీ మనమే.
వ్యక్తిత్వ వికాసం విలువలతో వికాసం
ఎప్పుడవుతుంది? ఎలా?
ఇందులో చదవండి






Reviews
There are no reviews yet.