సజీవం (కవిత్వం)

120.00

– తెలకపల్లి రవి
Pages – 96
‘‘చాలా యుద్ధాలు గెలిచాను
బయిట కొత్త భేరి మోగుతోంది
చాలా సార్లు ఓడాను
కానీ నా చిరునామా పోరాటమే’’
మిత్రులు తెలకపల్లి రవి జర్నలిస్టుగా సాహిత్య విమర్శకుడుగా ప్రసిద్ధి. సజీవం కవితా సంపుటి ఇప్పుడు ఆయనలోని కవితాభినివేశాన్ని కళ్లకు కడుతున్నది.
‘‘నీకు దోపిడీ పీడన అంటే
పడికట్టు అవుతుంది
నాకు పీడితులు తాడితులంటే
నుడికారం పుడుతుంది’’

‘‘ఆశయం చిరంజీవి
అలా నడిపిస్తూ వుంటుంది’’
నిజ జీవితంలో ఆయన నిత్యం నడుస్తున్న చరిత్రకు వ్యాఖ్యాతగా వున్న సంగతి మనందరికి తెలుసు. ఆ అనుభవంతో అంటున్నాడు –
‘‘దినదినం పలకరిస్తుంది చరిత్ర
క్షణం క్షణం నిర్మాణమవుతుంది చరిత్ర’’
తన కవిత్వంతో రవి పురోగామి శక్తుల పట్ల చెదరని ఆశను, భవిష్యత్తుపై విశ్వాసాన్ని, కలిగిస్తున్నారు. జీవితానికి మానవ స్వభావాలకూ సమాజ సంఘర్షణలకూ సంబంధించిన అనేక కవితాత్మకచరణాలు ఇందులో మీకు దర్శనమిస్తాయి-
‘‘మాది ప్రజాసంఘర్షణ
ఎవరికి తలవంచబోదు
మాది ఉక్కు సంకల్పం
వూరికెనే చెదరిపోదు’’
– నిఖిలేశ్వర్‌

Reviews

There are no reviews yet.

Be the first to review “సజీవం (కవిత్వం)”

Your email address will not be published. Required fields are marked *