- You cannot add "నాన్నా ఎందుకిలా చేశారు?" to the cart because the product is out of stock.
అచంచల కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ డివిఎస్
₹60.00
పేజీలు : 64
కామ్రేడ్ డి.వి.సుబ్బారావు అంటే క్రమశిక్షణకు, పట్టుదలకు, సైద్ధాంతిక నిబద్ధతకు మారుపేరు. డివిఎస్గా సన్నిహితులు పిలుచుకునే సుబ్బారావు జీవితం, కృషి కమ్యూనిస్టు పార్టీ పత్రికలతో సన్నిహితంగా పెనవేసుకొన్నది. తొలుత విశాలాంధ్ర, తర్వాత జనశక్తి పత్రికల అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. కమ్యూనిస్టు పార్టీ చీలి మార్కి ్సస్టు పార్టీగా అవతరించినపుడు ఎంతో నిబద్ధతతో మార్కి ్సస్టుపార్టీతో ఆయన దృఢంగా నిలబడ్డారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పాలకుల కరకు నిర్బంధంలో తీవ్ర చిత్రహింసలకు ఆయన గురయ్యారు, జైలు పాలయ్యారు. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి సోకి చివరికి నిర్బంధంలోనే కన్నుమూశారు. డివిఎస్ మనకు దూరమై దశాబ్దాలు అయినప్పటికీ నేటికీ ఆయనను స్మరించుకుంటున్నామంటేనే ఆ కామ్రేడ్ గొప్పదనం అవగతమవుతుంది.
Reviews
There are no reviews yet.