ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు

30.00

 

పేజీలు : 32

అల్లూరి సీతారామరాజు నాయకత్వాన్న మన్య ప్రజల వీరోచిత తిరుగుబాటు 1920 దశకంనాటి మాట. తరువాత దేశంలో స్వాతంత్య్రం కోసం అనేక పోరాటాలు విప్లవాలు జరిగాయి. అహింస ద్వారా స్వాతంత్య్రాన్ని మేమే తెచ్చాం అని కాంగ్రెస్‌వారు అంటున్నారు. కాదు మేమే నిజమైన వారసులమని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు వాదిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తరువాత నేడు 2022లో మనం వున్నాం. స్వాతంత్య్రం సాధించింది ఏమిటి? అని ఎవరైనా ప్రశ్నించుకుంటే దిక్కులు లెక్కపెట్టే స్థితిలో వుంది నేటి పరిస్థితి. అన్ని రంగాలలోనూ అన్ని తరగతులకు చెందిన ప్రజలలోనూ సమస్యలే. కళ్ళున్న వారికి ఎవరికయినా కనిపిస్తుంది నేటి భారతి దీనావస్థ (పాలకులకు తప్ప) నాటి స్వాతంత్య్ర సమరయోధులు ఆశించిన స్వరాజ్యం ఇదేనా? ఎప్పటికీ కాదు.
అందరూ ఆనందంగా వుండే సమసమాజం కోసం యువకులుగా మన కర్తవ్యం పూర్తి చేయాల్సి వుంది. ఈ కర్తవ్య నిర్వహణలో అలనాటి మన్య విప్లవ వీరునిగాధ నేటి యువలోకానికి ఉత్తేజాన్ని కలుగచేస్తుందనే ఉద్దేశ్యంతో ఈ చిన్ని పుస్తకం.

Reviews

There are no reviews yet.

Be the first to review “ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు”

Your email address will not be published. Required fields are marked *