ఎలాంటి అభివృద్ధి? ఎవరి అభివృద్ధి?

 25

1990వ దశకంలో భారత ఆర్థిక వ్యవస్థ ఉరకలు పరుగులు తీస్తున్నట్లు చెప్పిన కాలంలోనే మన వ్యవసాయ రంగంలో సంక్షోభం తలెత్తింది. దానికి అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దివాళా తీసింది. ఈ కాలంలో మూడు లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉత్పత్తి రంగం స్తంభించిపోయింది. ప్రతి సంవత్సరం 1.3 కోట్ల మంది భారతీయులు జన్మిస్తుంటే, ఉద్యోగాలు మాత్రం వీరిలో 10 శాతం మందికే వస్తున్నాయి. ఆర్థిక సరళీకరణ విధానాలు చేపట్టిన ఈ రెండు దశాబ్దాల్లో భారత దేశ 'అభివృద్ధి' ధనవంతులను సంతృప్తిపరిచేందుకు, వారికి సేవలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మీదనే కేంద్రీకరించబడింది. అదేసమయంలో పేదలకు కనీసావసరాలు కూడా తీరలేదు. 'వికాస్‌' పేరుతో దేశంలో పేదలు ఎలా ధనికులకు సబ్సిడీ ఇస్తున్నారో ఈ పుస్తకం వివరిస్తుంది. అందరి దేశం మన దేశం (సబ్‌కా దేశ్‌ హమారా దేశ్‌) కార్యక్రమంలో భాగంగా అఖిల భారత ప్రజా సైన్సు ఉద్యమం (ఎఐపిఎస్‌ఎన్‌) తీసుకువస్తున్న పుస్తక పరంపరలో ఈ చిరుపుస్తకం ఒకటి. భారతదేశంలో విభిన్న భావపరంపరలను కాపాడేందుకు కృషి చేసేవారందరితో కలిసి పనిచేయడానికి ప్రజా సైన్సు ఉద్యమం చేస్తున్న ప్రయత్నంలో ఈ కార్యక్రమం ఒక భాగం. జాతి పురోభివృద్ధి కోసం సామాజిక కృషి చేయడం, ప్రజాజీవితాలను మెరుగుపరచడం దీని లక్ష్యం.

Description


పేజీలు : 32
వెల : 25/-

Reviews

There are no reviews yet.

Be the first to review “ఎలాంటి అభివృద్ధి? ఎవరి అభివృద్ధి?”

Your email address will not be published. Required fields are marked *