కర్మయోగి వీరబ్రహ్మం

 30

ఆచార్య ఎన్‌.గోపి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. తెలుగు చదివారు. అక్కడే అమరేశం రాజేశ్వర శర్మ గారి పర్యవేక్షణలో వేమన మీద పరిశోధన చేశారు. ''ప్రజాకవి వేమన'' పేరుతో తన సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. ఆ గ్రంథం ఇప్పటికి ఆరుసార్లు ప్రచురింపబడింది. ఆ తర్వాత వేమన పద్యాల మీద వ్యాఖ్యానం రాసి 'వేమన్న వాదం' పేరుతో ప్రచురించారు. ఆ తర్వాత మరికొన్ని పద్యాల మీద వ్యాఖ్యతో ''వేమన్న వెలుగులు''గా అచ్చువేశారు. 1733లో ఫాదర్‌ లెగాక్‌ పారిస్‌కు పంపిన వేమన పద్యాలను సంపాదించి ''వేమన పద్యాలు - ప్యారిస్‌ ప్రతి'' పేరుతో ప్రచురించారు. ''తంగెడుపూలు'' ''మైలురాయి'' మొదలైన 30 సంపుటాల కవిత్వం రాశారు. ''గవాక్షం'' మొదలైన విమర్శ గ్రంథాలు రాశారు. 'యాత్రా చరిత్ర' రాశారు. అనువాదాలు చేశారు. ''కాలాన్ని నిద్రపోనివ్వను'' కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ''జలగీతం'' అనే వచన మహాకావ్యం రాశారు. ''నానీలు'' అనే కొత్త వచన ప్రక్రియను సృష్టించారు. ఈయన కావ్యాలు దాదాపు అన్ని భారతీయ భాషలలోకి అనువాదాలయ్యాయి. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా పని చేశారు. అంతకు ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులు, పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులు, హాస్టల్‌ చీఫ్‌ వార్డెన్‌, డీన్‌ వంటి పదవులు నిర్వహించారు. సాహిత్య అకాడమీ కార్య నిర్వాహక కమిటీ సభ్యులుగా, తెలుగు సలహా మండలి కన్వీనర్‌గా, నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ తెలుగు సలహామండలి సభ్యులుగా చేశారు. అనేక దేశాలు తిరిగారు. ఈయన నల్గొండ జిల్లా భువనగిరి వాసి.

Description


పేజీలు : 40
వెల : 30/-

Reviews

There are no reviews yet.

Be the first to review “కర్మయోగి వీరబ్రహ్మం”

Your email address will not be published. Required fields are marked *