కుసుమ ధర్మన్న జీవిత ప్రస్థానం

 25

  • పుట్ల హేమలత గారు పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం, రాజమండ్రిలో ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నారు. 13 సంవత్సరం లోనే తొలి కథ ‘తిరిగి రాని పయనం’తో రచనా వ్యాసాంగానికి శ్రీకారం చుట్టారు.
  • పలు పత్రికల్లో, కవితలు, వ్యాసాలు వ్రాసారు. కొన్ని కథలు, కవితలు హిందీ ఇంగ్టీషు భాషలలోకి అనువదించబడ్డాయి. అంతర్జాతీయ జాతీయ సదస్సులలో పాల్గొని 30కి పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు.
  • 2011 సంవత్సరంలో అంతర్జాల విహంగం అనే మహిళా సాహిత్య పత్రికను ప్రారంభించారు. కవి సమ్మేళనాల లోనూ, దూరదర్శన్‌, ఆకాశవాణిలలో చర్చలలో పాల్గొన్నారు. వ్యాసాలు ప్రసారం అయ్యాయి.
  • హేమలత గారు ధర్మన్న జీవిత విశేషాలను ఎంతో శ్రమ కోర్చి వెలుగు లోనికి తెచ్చారు. అపూరూప ఛాయా చిత్రాలను మనకందించారు. ధర్మన్న కవిలోని నిబద్ధతను, నిజాయితీని, తాత్వికతను మనకు తెలుసుకునే అవకాశం కలిగించారు ఈ పుస్తకం ద్వారా. దళితులలో చైతన్య స్ఫూర్తిని నింపేందుకు తన ధన ప్రాణాలను పణంగ పెట్టారు ధర్మన్న. హిందుత్వ దుర్మార్గం ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నది.
  • ‘దళిత శక్తి’ పెరిగితేగాని ఈ దౌర్జన్యం ఆగదు. ధర్మన్న జీవితం మనకు నేర్పేదదె. ధర్మన్న త్యాగాన్ని వృధా పోనియ్యకుండా అణగారిన ప్రజలంతా మరింత చైతన్యవంతులయితేనే గాని పాలకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేము. అదెలాగో తెలసుకోవాలంటే ధర్మన్న గారి జీవితము చదవాల్సిందే.

Description

పేజీలు : 24
వెల : 25/-

Reviews

There are no reviews yet.

Be the first to review “కుసుమ ధర్మన్న జీవిత ప్రస్థానం”

Your email address will not be published. Required fields are marked *