జాతీయ సమగ్రతా సమస్యలు
₹50.00
పేజీలు : 48
భారతదేశం యావత్తూ 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటోంది. భారత జాతీయోద్యమం ఒక గొప్ప చారిత్రిక పోరాటం. రెండు వందల సంవత్సరాలకు పైగా ఈ భారత ఉపఖండాన్ని ఆక్రమించుకుని, దాని సిరి సంపదలను కొల్లగొట్టిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కబంధహస్తాల నుండి ఈ దేశాన్ని విముక్తి చేసిన ఉద్యమం అది. భగత్సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వీరులు ఎందరో స్వతంత్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. వేల మంది నిర్బంధాలపాలయ్యారు. లక్షలాదిగా ప్రజానీకం మహాత్ముడి పిలుపులనందుకొని ఉద్యమాలబాటలో నడిచారు. ఇందరి అశేష త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ స్వతంత్ర భారతదేశాన్ని నేడు పాలిస్తున్నది బిజెపి, మోడీ`షా ద్వయం. ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో నడుచుకుంటూ ఈ దేశ ప్రయోజనాలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల స్వార్ధానికి బలి పెడుతోంది. అమెరికన్ సామ్రాజ్యవాదానికి నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ దేశ స్వావలంబననే దెబ్బ తీస్తోంది.
Reviews
There are no reviews yet.