న్యూమోల్‌

80.00

పేజీలు : 176
ఈ పుస్తక రచయిత ఎమిర్‌ సాదెర్‌ విప్లవ క్రమాన్ని ‘మోల్‌’ అంటే ఓ విచిత్రమైన జీవి అడవి చుంచెలుకతో పోల్చాడు. ఈ జీవి భూమి లోపల ఉండి నిరంతరం భూమిని తొలుస్తూ ఉంటుంది. అది ఎప్పుడో వూహించని ప్రదేశంలో, వూహించని సమయంలో బయటకు వస్తుంది. ఎమిర్‌ సాదెర్‌ ఈ అడవి చుంచెలుకను ప్రతీకగా తీసుకొని, ఇటీవలి సంవత్సరాలలో లాటిన్‌ అమెరికాలో నయా ఉదారవాద విధానాలకు ప్రత్యామ్నాయాలుగా ఆవిర్భవించిన పలు ప్రభుత్వాలను అభివర్ణించారు. ఇవి కొత్తగా వచ్చినవి కాబట్టి ఈ పుస్తకానికి కూడ ‘న్యూ మోల్‌’ అని నామకరణం చేశాడు. సాదెర్‌ ఈ పుస్తకంలో ఆయా ప్రభుత్వాల స్వరూప స్వభావాలను, ప్రపంచ విప్లవ క్రమానికి అవి ఏ విధంగా దోహదపడగలవో చెప్పడంతో పాటు, వాటి పరిమితులనూ వివరించారు. సాదెర్‌ దక్షిణ అమెరికాలో ఒక అగ్రశ్రేణి రాజకీయ సిద్ధాంతవేత్త. ఆయన ఈ పుస్తకంలో లాటిన్‌ అమెరికా తాజా పరిణామాలను చారిత్రక దృష్టితో, ఆయా దేశాల పరిస్థితులను నిర్దిష్టంగా, ప్రాదేశిక, కాలగమనికలతో సహా పేర్కొంటూ విశ్లేషించారు.

Out of stock

SKU: లాటిన్‌ అమెరికా వామపక్ష మార్గం Categories: , ,

Reviews

There are no reviews yet.

Be the first to review “న్యూమోల్‌”

Your email address will not be published. Required fields are marked *