బి.టి.రణదివె

 90

  • భారత కమ్యూనిస్టు ఉద్యమ మహాప్రస్థానంలో దాదాపు ఏడు దశాబ్ధాలపాటు ముఖ్య భూమికను పోషించిన అగ్రశ్రేణినేత, కామ్రేడ్‌ బిటిఆర్‌. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి, భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి నడుమ సంధానకర్తగా వ్యవహరించిన మార్క్సిస్టు మేధావి. మనదేశ నిర్థిష్ట పరిస్థితుల్లో విప్లవోద్యమం ఏ పంథా చేపట్టాలో నిర్థారించటంలో కీలకపాత్ర పోషించారు.
  • కష్టజీవుల విముక్తికి సోషలిస్టు సమాజ స్థాపనే పరిష్కారం. సోషలిజాన్ని సాధించడంకోసం జరగవలసిన మహోద్యమానికి నాయకత్వపాత్ర కార్మిక వర్గమే పోషించాలి. అందుకే మనదేశంలో సమరశీల కార్మికోద్యమ నిర్మాణానికి, విశాల ప్రాతిపదికన కార్మికవర్గాన్ని ఐక్యపరచడానికి కామ్రేడ్‌ బిటిఆర్‌ అవిరళ కృషి చేశారు. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులుగా దాదాపు మూడు దశాబ్ధాలు మార్గనిర్ధేశం చేశారు. వర్గ ఐక్యత సాధనలో శ్రామిక మహిళలకు గల ప్రముఖ స్థానాన్ని తెలియజెప్పిన నేత బిటిఆర్‌. మత విద్వేషం, అస్థిత్వవాదం,ప్రాంతీయతత్వం, కార్మికవర్గ ఐక్యతను దెబ్బతీస్తాయని ముందే హెచ్చరించిన ద్రష్ట కామ్రేడ్‌ బిటిఆర్‌.
  • ఆంధ్రరాష్ట్రానికి, ఇక్కడి కార్మికోద్యమానికి అఖిల భారత కేంద్రం నుండి కామ్రేడ్‌ బిటిఆర్‌ పలుసందర్భాలలో విలువైన మార్గ దర్శకత్వాన్ని అందించడమేగాక ఇక్కడ జరిగిన పోరాటాలలో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు. విశాఖ, హైదరాబాద్‌ ప్రభుత్వరంగ కార్మికోద్యమానికి పునాదులు వేయడంలో సహకారం అందించారు.
  • కామ్రేడ్‌ బిటిఆర్‌ విశిష్ట వ్యక్తిత్వం గురించి, ఆయన సహచరులుగా ఉండిన మార్క్సిస్టు మహానేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు చూస్తే మనకు అటువంటి గొప్ప నాయకులువేసిన బాటలో నడుస్తున్నందుకు గర్వంగా ఉంటుంది.
  • కామ్రేడ్‌ బిటిఆర్‌ చరిత్రను ఈ పుస్తకంలో రేఖామాత్రంగానైనా, స్పష్టంగా వివరించారు. కార్మికరంగంలోని ప్రతీ కార్యకర్తా తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

Description


పేజీలు : 124
వెల : 90/-

Reviews

There are no reviews yet.

Be the first to review “బి.టి.రణదివె”

Your email address will not be published. Required fields are marked *