భారతీయ భౌతికవాదం లోకాయత

 25

ప్రాచీన భారతీయ తత్వశాస్త్ర చరిత్రలో భౌతికవాద భావాలకు, హేతుయుక్తమైన ఆలోచనా సాంప్రదాయాలకు ఎన్నడూ తావే లేదని పాలక, పురోహిత వర్గాలు రాయించుకున్న పురాణాలు, ధర్మసూత్రాలు, ఇతిహాసాలు ఒక్కుమ్మడిగా నమ్మబలుకుతున్నాయి. భారతదేశంలో ఆదిశంకరాచార్యుడి నుంచి, ఆధునిక కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వరకు ఇదే బాణీ. ఆ తరువాత కాలంలో వచ్చిన భావవాద తత్వవేత్తలంతా ఇదే బాటలో నడుస్తున్నారు.
దేవీప్రసాద్‌ ఛటోపాధ్యాయ, కె. దామోదరన్‌, సర్దేశారు, డి.డి.కోశాంబి, రోమిలా థాపర్‌, ఆర్‌.యస్‌.శర్మ వగైరా భారతీయ చరిత్రకారులు తత్వవేత్తలు, వాల్టర్‌ రూబెన్‌, డేల్‌రీప్‌, ఏ.యల్‌, భాషామ్‌ వగైరా అంతర్జాతీయ స్థాయి తత్వవేత్తలు ధైర్యంగా నిలబడి భారతీయ తత్వశాస్త్రంలో సశాస్త్రీయ, భౌతికవాద ధోరణులు సాంప్రదాయాలు తొలినుంచి బలంగానే ప్రాచుర్యంలో ఉన్నాయని ఎలుగెత్తి చాటారు. సోదాహరణంగా నిరూపించారు. చరిత్ర ఆటుపోట్లలో, భారతీయ భౌతికవాదం, ఒక్కొక్కప్పుడు ఉధృతంగా, బాహాటంగాను, మరికొన్ని అననుకూల సమయాల్లో బలహీనంగా, ప్రచ్ఛన్నంగా ఉన్నప్పటికీ మొత్తంమీద మొదటినుంచి ఆధునికయుగం వరకు ప్రపంచంలో అన్నిచోట్లలాగే భారతదేశంలోనూ భౌతికవాద భావస్రవంతి కొనసాగుతూనే వచ్చిందని బలమైన ఆధారాలతో ఋజువు అయ్యింది. అటువంటి భౌతికవాద భావస్రవంతిలో ఒకటైన లోకాయత గురించి వివరించేదే ఈ పుస్తకం.

Description


పేజీలు : 32
వెల : 25/-

Reviews

There are no reviews yet.

Be the first to review “భారతీయ భౌతికవాదం లోకాయత”

Your email address will not be published. Required fields are marked *