రాజశేఖర చరిత్రము

 140

'కందుకూరి వీరేశలింగం' అనేది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు. సుమారు 170 సంవత్సరాల కిందటి తెలుగు సామాజిక చరిత్ర పర్యాయపదం. వ్యవస్థాగతమైన అనేక వెనుకబాటుతనాలకూ, అంధవిశ్వాసాలకూ, అణచివేతలకూ, వివక్షలకూ, కష్టాలకూ, కడగండ్లకూ ఆ పేరొక సజీవ సాక్ష్యం. పంతులు గారు చేసిన శతాధిక రచనలు వారికి ప్రతిరూపాలు. ముఖ్యంగా 'రాజశేఖరచరిత్ర' వంటి నవలలు కందుకూరి వీరేశలింగం అనే నామవాచకానికి సర్వనామాలు. నవలా ప్రక్రియను మనం కల్పనా సాహిత్యంలో భాగంగా పరిగణిస్తున్నాం. ఇక్కడ కల్పన అంటే అబద్ధం అని కాదు. యథార్ధ సంఘటనలకు వాస్తవిక వ్యక్తీకరణలు. రచయితల ఆకాంక్షలకు ఆవిష్కరణలు. ఏ రచయితైనా కల్పనా సాహిత్యంలో తనకు తెలిసిన జీవితాన్నే చిత్రిస్తాడు. ప్రతి రచయితకూ ఒక కాలం ఉంటుంది. అతడి చుట్టూ సమాజం ఉంటుంది. ఆ సమాజం ఆ రచయితకు కొన్ని అనుభవాలనిస్తుంది. మరికొన్ని పాఠాలను నేర్పుతుంది. వీటన్నింటి నుంచీ రచయిత తనదైన తాత్త్వికచింతనలోంచి స్ఫూర్తిని పొందుతాడు. తనలో జరిగిన సంఘర్షణలోంచి అక్షరంగా బైటకొస్తాడు. కందుకూరి 'రాజశేఖర చరిత్ర' కూడా ఇలా పుట్టిందే.

Description


పేజీలు : 184
వెల : 140/-

Reviews

There are no reviews yet.

Be the first to review “రాజశేఖర చరిత్రము”

Your email address will not be published. Required fields are marked *