వానరుడు నరుడైన క్రమంలో శ్రమ పాత్ర

(1 customer review)

15.00

పేజీలు : 24
తినదగినదల్లా తినటం నేర్చుకున్నట్లే, ఏ శీతోష్ణస్థితిలోనైనా నివసించడాన్ని మానవుడు నేర్చుకొన్నాడు. ఇతర జంతువులు (పెంపుడు జంతువులు, క్రిమి కీటకాలు) తమకు తాముగా కాక, మానవుని అనుసరించి అన్నిరకాల శీతోష్ణస్థితులకు అలవాటు పడ్డాయి. ఎల్లప్పుడూ వేడిగా వుండే వాతావరణంతో కూడిన తన తొలి నివాస స్ధానం నుండి మానవుడు చలి ప్రాంతాలకు, అంటే, ఎక్కడైతే సంవత్సర కాలం వేసవిగానూ, చలికాలంగానూ విభజితమైవుందో ఆ ప్రాంతాలకు తరలడంతో కొత్త అవసరాలు తలయెత్తాయి. చలినుండీ, తేమ నుండీ రక్షణకై ఇల్లూ, దుస్తులూ అవసరమయ్యాయి. ఆ కారణంగా శ్రమకు సంబంధించిన నూత్న రంగాలు ఆవిర్భవించాయి. తత్పర్యవసానంగా కొత్తరకం కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. అవి జంతువుల నుండి మనిషిని అంతకంతకూ ఎక్కువగా వేరు చేశాయి.

1 review for వానరుడు నరుడైన క్రమంలో శ్రమ పాత్ర

  1. Siva Sanjay

    Nice website

Add a review

Your email address will not be published. Required fields are marked *