విశ్వనరుడు గుర్రం జాషువ

100.00

పేజీలు : 128
ఆయన దళితకవి. ఆయనది కలికి తెలుగు కులం. ఆయన అచ్చమైన భారతీయుడు. ఆయన విశ్వనరుడు. దళితవేదన, తెలుగు భాషాభిమానం, భారత జాతీయత, విశ్వజనీన దృష్టి ఆయన కవిత్వంలో కనిపించే విశేషాలు. సామాజిక వాస్తవికత ఆయన వస్తువు. పద్యం ఆయన సాధనం. అధిక్షేపం ఆయన విద్య. చరిత్ర పట్ల గౌరవం, దేశభక్తి పుష్కలం. ఆయనకిద్దరు గురువులు – ఆకలి, అంటరానితనం. ఆయన కోపం వ్యక్తులపైనకాదు, వ్యవస్థపైన. కులమతాలు లేని సమాజం ఆయన స్వప్నం. అందులో మనుషులందరూ ఒక తల్లి బిడ్డలు లాగా బతకాలి. అందులో ఆధిపత్యం, అహంకారం ఉండకూడదు. అందులో ఆడంబరాలకు, అవినీతికి చోటులేదు. అందులో అందరూ సమానులు కావాలి.
అహింస ఆయన కవచం. సహనం ఆయన అయుధం. ప్రపంచ శాంతి ఆయన లక్ష్యం.
ఇన్ని మహాగుణాల సంపుటి
కళాప్రపూర్ణ, నవయుగ కవిచక్రవర్తి
కవికోకిల గుర్రం జాషువా
– రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

Out of stock

Reviews

There are no reviews yet.

Be the first to review “విశ్వనరుడు గుర్రం జాషువ”

Your email address will not be published. Required fields are marked *