వీరబ్రహ్మం రచనలు సామాజిక స్పృహ

 70

డా|| మూల మల్లికార్జునరెడ్డి గారు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనే పోతులూరి వీరబ్రహ్మం మీద పరిశోధన చేశారు. ''శ్రీ వీరబ్రహ్మేంద్రుని తాత్త్విక దార్శనికత'' పేరుతో తన సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. పలుచోట్ల పార్ట్‌టైం ఉద్యోగాలు చేసి యోగివేమన విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకుడుగా చేరారు. కొంతకాలానికి అక్కడే లలితకళల విభాగంలోకి అధ్యాపకుడుగా వెళ్ళారు. వ్యాసవైజయంతి, గోష్ఠి అనే విమర్శ వ్యాస సంపుటాలు ప్రచురించారు. లలితకళల విభాగం విద్యార్థుల కోసం ''లలితకళా విలాసం'' అనే గ్రంథం రాశారు. వాల్మీకి రామాయణాన్ని సులభమైన భాషలో 'మల్లికార్జున రామాయణం' రాశారు. 'మల్లికార్జున శతకం' రాశారు. మల్లికార్జున రెడ్డి గారు నటుడు. పౌరాణిక చారిత్రక సాంఘిక నాటకాలలో నటిస్తుంటారు. అనేక నాటకాలను తన విద్యార్థులతో ప్రదర్శింపజేస్తున్నారు. ''రాయలసీమ నాటకం'' అనే అంశం మీద యుజిసి ప్రాజెక్టు చేస్తున్నారు. సిపి బ్రౌన్‌ భాషా పరిశోదన కేంద్రం బాధ్యులుగా ఉన్నారు. ఈయన స్వగ్రామం కడప జిల్లాలోని తుడుములదిన్నె. ఇది నాచన సోముడు పుట్టిన గ్రామం.

Description

పేజీలు : 88
వెల : 70/-

Reviews

There are no reviews yet.

Be the first to review “వీరబ్రహ్మం రచనలు సామాజిక స్పృహ”

Your email address will not be published. Required fields are marked *