హైడీ

40.00

పేజీలు : 56
అది స్విట్జర్లాండ్‌లోని ఓ పట్టణం. పేరు మేయర్‌ఫెల్ష్‌. ఆల్ప్స్‌ పర్వత అంచున వున్నదా పట్టణం. ఓ వేసవికాలపు ఉదయం డెటీ ఆ పట్టణంనుండి పర్వత శిఖరాలవైపు పయనిస్తోంది. ఒకచేత్తో సంచి మరోచేత్తో ఓ పాపచేయిపట్టుకుని ఆ పర్వతంపై ఆమె నడుస్తోంది. ఐదేళ్ళ ఆ పాప చాలా ఆరోగ్యంగా వుంది. పర్వతంపై నడవడం వల్ల ఆలసటకు లోనయ్యిందేమో… ఆ చిన్నారి చెక్కిళ్ళు ఎర్రబారాయి. ఆమె వేసుకున్న బూట్లు పర్వతాన్ని తేలిగ్గా ఎక్కేందుకు దోహదపడుతున్నాయి. అలా ఓ గంటపాటు ప్రయాణించాక వారిద్దరూ డోర్ల్ఫి అనే కుగ్రామం చేరుకున్నారు. అక్కడికి అడుగుపెట్టీ పెట్టకముందే డెటీని అనేకమంది పలుకరించారు. ఆమె ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడలేదు. పర్వతయానం వల్ల అలసటకులోనై చిన్నారి కొద్ది నిమిషాల తర్వాత ఓ ఇంటి అరుగుమీద కూలబడింది. ”తాతయ్యవాళ్ళ ఇల్లు దగ్గర్లోనే లే అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చులే అంటూ డెటీ చిన్నారి చేయిపట్టుకుని లేవదీసింది. పాప అయిష్టంగానే లేచి నిలబడింది. ఇంతలో ఆ ఇంట్లోనుండి గలగల మాట్లాడుకుంటూ ఓ మహిళ బయటకొచ్చి డెటీని మాటల్లో పెట్టింది.

Reviews

There are no reviews yet.

Be the first to review “హైడీ”

Your email address will not be published. Required fields are marked *