ఆశయపథం … అపూర్వ విజయం తెలుగు ప్రజల పోరాట చరిత్ర

180.00

– తెలకపల్లి రవి
Pages – 144
తెలుగు ప్రజల చరిత్రలో ఒక ఉజ్వల పోరాట ఘట్టానికి ప్రతిబింబం ఆశయపథం. ఆ పోరాటం సాధించిన ఘన విజయాల చిత్రణ. అప్పటికి తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో వుంది. ఆంధ్ర ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగం. తెలుగు ప్రజలు కలసికట్టుగా కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఆధ్వర్వ్యంలో అపూర్వ పోరాటం సాగించారు, మహత్తర విజయాలు సాధించారు. భయానకమైన నిర్బంధాన్ని, పాలకులు పాశవిక హత్యాకాండను తట్టుకుని ఎర్రజెండా నిలబెట్టారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, కాల్మొక్త దొర అన్న వారే ఆ పీడకులను వెంటతరిమి లక్షల ఎకరాలు సాధించుకోవడం చరిత్రనే మార్చింది. ఆ సమయంలోనే ఆంధ్ర ప్రాంతంలోనూ పోలీసు నిషేదాలు, వేట వందల ప్రాణాలు బలితీసుకున్నాయి. ఇంతటి రాక్షస కాండలోనూ కార్యకర్తలు తలవంచక పోరాడారు. ప్రాణాలు పోతున్నా ప్రజలతోనే నిలిచారు. ఫలితంగా 1952 ఎన్నికల్లో ఆంధ్రలోనూ, తెలంగాణలోనూ, తెలుగు ప్రాంతాలలో కమ్యూనిస్టులే అతి పెద్ద శక్తిగా విజయభేరి మోగించారు. ఈ సమరశీల ఘట్టంలో ఎందరు ఎన్ని త్యాగాలు చేశారో ఎంత ధైర్యంగా పోరాడారో తెలుసుకుంటే ఉత్తేజం ముప్పిరిగొంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన నేటి నేపథ్యంలో యువత ప్రత్యేకంగా చదవాల్సిన పుస్తకం.
అదే ఆశయపథం.. మరోసారి మీ చేతుల్లో…

 

Categories: ,

Reviews

There are no reviews yet.

Be the first to review “ఆశయపథం … అపూర్వ విజయం తెలుగు ప్రజల పోరాట చరిత్ర”

Your email address will not be published. Required fields are marked *