విద్య ప్రయివేటీకరణ, కాషాయీకరణకే నూతన విద్యావిధానం

40.00

పేజీలు : 48
బిజెపి ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానం పూర్తిగా తిరోగమన దిశలో ఉంది. సమ సమాజానికి పునాది వేయవలసిన విద్యా విధాన మౌలిక లక్ష్యం నుంచి వెనకడుగు వేయడమే ఈ నూతన విద్యా విధాన (ఎన్‌ఇపి) సారాంశం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను విద్యా రంగానికి దూరం చేయడం ఈ నూతన విధానంలో కనపడే పెద్ద వెనకడుగు. ఈ సామాజికంగా వెనకబడిన తరగతుల రక్షణ కోసం రూపొందిన రిజర్వేషన్లు వంటి గ్యారంటీ చర్యల గురించిన ప్రస్తావన ఏదీ ఈ విధాన పత్రంలో మనకు కనిపించదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నేరుగా నిర్వహించే జెఎన్‌యు వంటి విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లను అమలు జరపకుండా ప్రభుత్వమే నీరుగారుస్తున్న తీరు గమనిస్తే ఈ విధాన పత్రంలో దళిత, ఒబిసి తరగతుల విద్యార్ధులను విద్యారంగం నుంచి పక్కకు నెట్టివేసే ధోరణి వెనుక ప్రభుత్వ పాత్ర స్పష్టంగా కానవస్తుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “విద్య ప్రయివేటీకరణ, కాషాయీకరణకే నూతన విద్యావిధానం”

Your email address will not be published. Required fields are marked *