దక్షిణ భారతదేశంలో ప్రథమ ప్రజా ఉద్యమకారుడు గాజుల లక్ష్మీనరసు చెట్టి (1806-1868)

100.00

పేజీలు : 104
గాజుల లకీëనరసు చెట్టి (1806-1868) మద్రాస్‌ ప్రెసిడెన్సీలో 19వ శతాబ్ది ప్రజాఉద్యమ నిర్మాత, నిర్దేశకుడు. ఆయన కుటుంబం ఆంధ్ర తీరప్రాంతం (మచిలీపట్నం) నుండి మద్రాసు వలసవెళ్ళిన కుటుంబం. ఆయన చిన్నతనం నుండే సామాజిక దృష్టిని పెంపొందించుకొన్నాడు. సమకాలీన సాహిత్య సంఘాల చర్చలు, ఉపన్యాసాల్లో పాల్గొని, తన ఆలోచనాపరిధిని విస్తరించుకున్నాడు. వలస ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై గళమెత్తి, పోరాటం సాగించిన తొలి రాజకీయ వైతాళికుడు. మద్రాసు గవర్నర్‌ శాసన మండలి సభ్యుడిగా ప్రజాప్రతినిధుల ఎన్నిక విధానంపై ఆయన స్పందించాడు. ప్రజాహక్కులు, పౌర ప్రజాస్వామ్య పద్ధతులపై తన వాదనను బలంగా వినిపించాడు. సమకాలీన మేధావులు ముక్తకంఠంతో లకీëనరసు చెట్టిని మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ‘తొలి ప్రజాపోరాట యోధుడు’గా వర్ణించారు. ఆయన జీవితచరిత్ర భావితరాలకు శిరోధార్యం.

Reviews

There are no reviews yet.

Be the first to review “దక్షిణ భారతదేశంలో ప్రథమ ప్రజా ఉద్యమకారుడు గాజుల లక్ష్మీనరసు చెట్టి (1806-1868)”

Your email address will not be published. Required fields are marked *