దేశభక్తి ముసుగులో…

 20

దేశభక్తి సంస్థగా ప్రచారం చేసుకుంటూ అనేక సంఘవిద్రోహ చర్యలకు పాల్పడుతూ ఉంటుంది.సంఘ కార్యకలాపాలను విస్తరించేందుకు , వారి బలాన్ని పెంచుకునేందుకు విద్యార్థులను టార్గెట్‌ చేసుకొని ఆకర్షిస్తుంటారు. వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పిస్తామని చెప్పి శాఖలకు పిలిచి మతోన్మాదాన్ని ప్రభోదించి ఒక ఉన్మాదిగా మార్చేస్తారు. ముస్లిములు, క్రైస్తవులు ఈ దేశ సమగ్రతకు, ఐకమత్యానికి ప్రమాదకరమని, వారిని ఈ దేశంలో అంతం చేయడం ఒక దైవకార్యమని నూరిపోస్తారు. చంపేందుకు ఉసిగొల్పుతారు. ఈ మోసాన్ని గ్రహించి వారి ట్రాప్‌లో పడి ఎవ్వరూ మోసపోకూడదని, అందులో పనిచేస్తున్న వారు కూడా కళ్లుతెరిచి బయటకు రావాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నాను. 12 ఏళ్లపాటు ఆసంస్థలో పనిచేసిన తరువాత అందులో ఉన్న కుట్రలను గ్రహించి దానితో ధర్మయుద్ధానికి దిగాను. నా అనుభవాన్ని మాత్రమే ఈ పుస్తకంలో రాశాను. ఇందులో ఏ అంశంపై అయినా అభ్యంతరం ఉంటే చర్చకు రావొచ్చు. ఆధారాలతో సహా నేను బహిరంగ చర్చకు సిద్ధమేనని తెలియజేస్తున్నాను.- విజయశంకర్‌రెడ్డి
SKU: ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రచారక్‌ పశ్చాత్తాపం Categories: , Tag:

Description


పేజీలు : 32
వెల : 20/-

Reviews

There are no reviews yet.

Be the first to review “దేశభక్తి ముసుగులో…”

Your email address will not be published. Required fields are marked *