నీలం నోట్‌బుక్‌ (నవల)

(1 customer review)

150.00

పేజీలు : 128
తమ సమకాలీనుల కోసమూ, అలానే భవిష్యత్తరాల కోసమూ లెనిన్‌ మహాశయుడిని పునఃసృష్టించాలన్న సంక్లిష్టమైన కార్యాన్ని పలువురు రచయితలూ, కళాకారులూ చేపట్టారు. సోవియట్‌ రచయితలలో సుప్రసిద్ధునిగా పేర్గాంచిన ఇమ్మాన్యూల్‌ కజకేవిచ్‌ (1913 – 1962) రచించిన నీలం నోట్‌బుక్‌ అనేది లెనిన్‌ గురించి వెలువడిన వాటిల్లో అత్యంత జనరంజకమైనది.
నీలం రంగు కవరుతో వున్న నోట్‌బుక్‌ నిజంగానే వున్నది. మహత్తర అక్టోబరు విప్లవం ముంగిట నెలకొన్న సంక్లిష్ట తరుణంలో రాజ్యము`విప్లవము అన్న ప్రముఖ గ్రంథానికి ఈ నోట్‌బుక్‌లో టూకీగా రాసుకున్న సమాచారమే ఆధారమైంది. ఈ తరుణంలో లెనిన్‌ రజ్లీవ్‌ స్టేషన్‌లో రహస్య జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక్కడనుండే ఆయన సాయుధ విప్లవానికి సన్నాహాలు చేశాడు.
ఈ సువిఖ్యాత రచయిత అందచేసిన సాహిత్య రచనలో లెనిన్‌ హృదయం ‘జీవిస్తుంది, జ్వలిస్తుంది, స్పందిస్తుంది’ అని సోవియట్‌ రచయిత, లెనిన్‌ బహుమతి గ్రహీత, లెనిన్‌ గురించి పలు ప్రపంచ ప్రసిద్ధ నాటకాలను రచించిన నికొలాయ్‌ పొగోడిన్‌ ప్రస్తుతించారు.

1 review for నీలం నోట్‌బుక్‌ (నవల)

  1. Madhu

    Good

Add a review

Your email address will not be published. Required fields are marked *