ప్రతిభామూర్తులు పసిడి పలుకులు

 65

  • తెలుగుభాష రాని నటీమణులను బొంబాయి నుంచి తీసుకువచ్చి సినిమాల్లో నటింప చేస్తున్నారు. వారు సంభాషణలు చెప్పరు. డబ్బింగు తప్పనిసరి. కథా నాయికలతో క్లబ్బు డ్యాన్సర్ల మాదిరి ఒంటిమీద మూడు గుడ్డ పీలికలను మాత్రమే ఉంచి నృత్యాలు చేయిస్తున్నారు. డ్యాన్సుల పేరుతో గంతులు వేయిస్తున్నారు. ఇది ఎంతో విచారకరం. - మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
  • కొందరు మహాకళాకారులు ప్రజా జీవితాన్నీ, వారి ఈతి బాధలనూ, సుఖదుఖాలనూ కళ్లకుకట్టే విధంగా.. వారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతూ ప్రజల శ్రేయస్సుకు ఆయుధంగా కళను చేపట్టారు. - కోరాడ నరసింహారావు
  • సమాజానికి ఎంతో సేవ చేసినవారి గురించి నేటి తరానికి తెలియజెప్పాలి. లేకుంటే వారెవరో తెలియకుండా పోతుంది. ఆ మహనీయుల పేర కమిటీలు వేసి ఉత్సవాలు నిర్వహించాలి. - సుద్దాల అశోక్‌తేజ
  • మహిళ గడపదాటని కాలం నాటికన్నా ఈనాడే వారిపై ఘోరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వారింకా నిస్సహాయ స్థితిలోనే ఉన్నారు. మహిళకు ఆర్థిక స్వావలంబన సమకూరినప్పుడే వీటికి చరమాంకం పలకొచ్చు. మహిళకు ఆర్థిక స్వావలంబన ఏర్పడాలంటే విద్యే కీలకం. -'పద్మశ్రీ' వి.కోటేశ్వరమ్మ
  • పిల్లలు మాతృభాషలో భావాన్ని వ్యక్తీకరించినంతగా అన్య భాషల్లో వ్యక్తీకరించలేరు. భాష బాగుంటే ప్రపంచమే మనదౌతుంది. మాతృభాష బాగా వస్తే ఇతర భాషలూ బాగా అబ్బుతాయి. - దేవినేని మధుసూదనరావు

Description


పేజీలు : 80
వెల : 65/-

Reviews

There are no reviews yet.

Be the first to review “ప్రతిభామూర్తులు పసిడి పలుకులు”

Your email address will not be published. Required fields are marked *