మన పాటలు – 3 ఎర్రజెండా-అమరవీరులు-రాజకీయ చైతన్య గీతాలు

200.00

పేజీలు : 200
నవరసాలలో పాటలో వ్యక్తం కాని స్పందన వుండదు. జానపదాలు తర్వాత ఆస్థాన కావ్యాలతో నడిచిన పాట ఉద్యమాలతో ఉజ్వల రూపం సంతరించుకుంది. ఉత్తేజమిచ్చింది. ఈకాలానికి సంగీతం ఒక పెద్ద అంతర్జాతీయ పరిశ్రమగా అంతర్జాతీయ వాణిజ్యంగా తయారైంది. అయితే ఈ భారీ వ్యవహారంలో నిద్రపుచ్చే మత్తు, మాయపుచ్చే వూపు వుంటుందేమో గాని సగటు మానవుల బాధావేదనలకు చీమంత చోటుండదు. కాని ‘పదండి ముందుకు’ అని కార్యోన్ముఖులను చేసే వాస్తవ గీతాల రీతి వేరు. వాటిని సృజించే, గానంచేసే ప్రజాకవుల తపన వేరు. ప్రతి పరిణామాన్ని పరిశీలిస్తూ నేర్చుకుంటూ పలికిస్తూ ప్రజల ఆలోచనలకు పదును పెడతారువాళ్లు. ప్రజల బాధలుప్రతిబింబిస్తారు. సుకవి జీవించు ప్రజల నాల్కల మీద అన్న జాషువా మాట ప్రజా కవులకు ఎప్పుడూ వర్తిస్తుంది. పల్లెల్లో పనిచేసే వారి నుంచి మేధావుల వరకూ ఆ పాటలతో పరవశిస్తారు. ప్రజానాట్యమండలి, ప్రగతిశీల సాహిత్య సంఘాలు ఆ విధమైన పాటలకు ప్రాణం పోశాయి. ఏ ఒకరి కోసమో కొద్ది మంది కోసమో సొమ్ముల కోసమో గాక కేవలం ఉద్యమాలకు అంకితమై పాటలతో బాటలు వేశాయి. అలా వివిధ దశల్లో మనం పాడుకున్న, పాడుకుంటున్నవి వందలాది గీతాలు, ఏర్చి కూర్చినవే ఈ ‘‘మన పాటలు’’ సంపుటాలు.

Reviews

There are no reviews yet.

Be the first to review “మన పాటలు – 3 ఎర్రజెండా-అమరవీరులు-రాజకీయ చైతన్య గీతాలు”

Your email address will not be published. Required fields are marked *