విప్లవం అంటే ఏమిటి? భగత్‌ సింగ్‌

 10

బ్రిటీష్‌ సామ్రాజ్యవాద పాలకుల పీడన నుండి భారత దేశాన్ని విముక్తి చేయడం కోసం 23 ఏళ్ల ప్రాయంలోనే ఉరికంబమెక్కిన విప్లవ యోధుడు షహీద్‌ భగత్‌సింగ్‌. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో త్యాగధనుల బాట నడిచిన భగత్‌సింగ్‌. రాజగురు, సుఖదేవ్‌ దేశంకోసం ప్రాణాలర్పించారు. భగత్‌సింగ్‌ను భారతదేశంలో తొలితరం మార్క్సిస్టుల్లో ఒకరుగా పేర్కొనవచ్చు. హిందూస్థాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ పార్టీ స్థాపకుల్లో ఆయన ఒకరు. భారత్‌, బ్రిటన్‌ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని జైలులో 64 రోజులపాటు నిరాహారదీక్ష చేపట్టి బ్రిటీషు పాలకులకు సింహస్వప్నంగా నిలిచాడు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతిరారును కాల్చి చంపిన పోలీసు అధికారిపై ప్రతీకారం తీర్చుకోవడం, పార్లమెంట్‌ భవనంలో బాంబు విసరడం చేసినందుకు 1931 మార్చి 23న భగత్‌ సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌లను ఉరితీశారు. భగత్‌ సింగ్‌ అమరుడై దాదాపు 90 ఏళ్లు కావస్తున్నా నేటికీ యువతరానికి వేగుచుక్కగా నిలిచాడు. ఆయన రాసిన రెండు ముఖ్యమైన వ్యాసాలను ఈ చిన్న పుస్తకరూపంలో అందిస్తున్నాం. ఇవి నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి.

Description

భగత్‌ సింగ్‌ వ్యాసాలు
పేజీలు : 32
వెల : 10/-

Reviews

There are no reviews yet.

Be the first to review “విప్లవం అంటే ఏమిటి? భగత్‌ సింగ్‌”

Your email address will not be published. Required fields are marked *