సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ

 70

పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అన్ని ఖండాల్లోని పెట్టుబడిదారీ దేశాలన్నిటా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగం ప్రబలింది. ఆర్థిక అసమానతలు పెరిగాయి. భారత దేశ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఆర్థిక సంక్షోభానికి తోడు కరోనా మహమ్మారి కాలంలో పెట్టుబడిదారీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా-ఉదారవాద విధానాలు శ్రామిక ప్రజల జీవనాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. 1980వ దశకంలో అట్టహాసంగా ప్రకటించిన నయా-ఉదారవాద విధానాలు పెట్టుబడిదారీ వ్యవస్థలోని అన్ని సమస్యలకూ సర్వరోగనివారిణిగా ప్రచారం చేసుకున్నారు. కానీ మూడు దశాబ్దాలు గడిచేసరికి ఆ విధానాల డొల్లతనం ప్రస్తుత ఆర్థిక సంక్షోభ రూపంలో బయటపడింది. భారత దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల నయా-ఉదారవాద విధానాల వల్ల దేశం కరోనాకు ముందే మాంద్యంలోకి జారుకున్నది. కరోనా మహమ్మారిని అరికట్టడంలో మోడీ ప్రభుత్వ అసమర్ధత వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ఒకవైపున ఆర్థిక సంక్షోభం, ఉపాధి కోల్పోవడంతో పాటు, అన్ని నిత్యావసర సరుకుల, ప్రత్యేకించి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు దారుణంగా పెరగడం ప్రజలనుభవిస్తున్న దుర్భర పరిస్థితిని మరింత తీవ్రం చేస్తున్నది. మోడీ ప్రభుత్వ హయాంలో తారాస్థాయికి చేరిన ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ప్రజల వద్ద ఏమీ మిగల్చలేదు. భూములు, గనులు, అడవులు, అంతరిక్షంలోని టెలికాం స్పెక్ట్రమ్‌లు అన్నింటినీ కార్పొరేట్లకు అర్పించేస్తున్నారు. అందుకు చట్టాలు ఆటంకంగా ఉంటే ఆ చట్టాలనే మార్చేస్తున్నారు. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తున్నారు. ఈ విధానాలు సామాజిక న్యాయాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ప్రజాధనంతో నిర్మించిన లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను గుండుగుత్తగా అమ్మేస్తున్నారు. ప్రభుత్వం నుండి ఏక కాలంలో తీవ్రతరమైన ఈ దాడులు దేశంలోని కార్మిక, రైతాంగ ఇతర శ్రామిక వర్గాలన్నీ ఏకమై ఎదిరించాల్సిన అనివార్య పరిస్థితులను కూడా కల్పిస్తున్నాయి. రైతులు, వివిధ సెక్షన్ల కార్మికులు, ఉద్యోగులు దేశవ్యాపిత పోరాటాల్లోకి వస్తున్నారు. ఈ ఆర్థిక సంక్షోభం, దానికితోడు కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ, భారత ఆర్థిక వ్యవస్థలు నడుస్తున్న తీరుతెన్నులు, నడవాల్సిన మార్గాలను సూచిస్తూ ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ రాసిన పుస్తక త్రయంలో ఇది ఒకటి.

Description


– ప్రభాత్‌ పట్నాయక్‌
పేజీలు : 88
వెల : 70/-

Reviews

There are no reviews yet.

Be the first to review “సంక్షోభంలో పెట్టుబడిదారీ వ్యవస్థ”

Your email address will not be published. Required fields are marked *