సాహిత్యం – మౌలిక భావనలు

 170

Literature - Basic Concepts
(ఆచార్య తూమాటి దొణప్ప స్వర్ణపతకం పొందిన ఉత్తమ పరిశోధన)
ఉత్తమ స్థాయి కవి, కథకులు, విమర్శకులుగా సుప్రసిద్ధులైన డా|| పాపినేని శివశంకర్‌ గుంటూరుజిల్లా నెక్కల్లులో విజయ దీపావళి 6 నవంబర్‌ 1953న జన్మించారు. ప్రాథమిక విద్య నెక్కల్లులో (1958-63), ఉన్నత పాఠశాలవిద్య తుళ్ళూరులో (1963-69) సాగింది. బి.ఏ.లో (1971-74), ఎం.ఎ.లో (1974-76) ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి స్వర్ణ పతకాలు పొందారు. బి.ఎస్‌.ఎస్‌.బి. జూనియర్‌ కళాశాల, తాడికొండలో తెలుగు అధ్యాపకులుగా, ప్రిన్సిపాల్‌గా 1977-2010 వరకు పనిచేశారు. స్తబ్ధత - చలనం (1984), ఒక సారాంశం కోసం (1990), ఆకుపచ్చని లోకంలో (1998), ఒక ఖడ్గం-ఒక పుష్పం (2004), రజనీగంధ (2013) శివశంకర్‌ కవితా సంపుటులు. మట్టిగుండె (1992), సగం తెరిచిన తలుపు (2008) కథా సంపుటాలు. సాహిత్యం - మౌలిక భావనలు (1996), నిశాంత (2008), తల్లీ! నిన్ను దలంచి (2012), ద్రవాధునికత (2015), మహా స్వాప్నికుడు (2016), 'నిసర్గ' (2019) విమర్శనాగ్రంథాలు.
ఇవి గాక ప్రత్యేకంగా 'అంకుర' పద్యసంపుటి (2020), 'వేదవ్యాసం' (2019) తాత్త్విక శోధన, 'ఆదర్శమూర్తులు' (2020) బాలల కథలు కూడా వీరి లేఖిని నుంచి వెలువడ్డాయి.
'రజనీగంధ' కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (2016) లభించింది.
1990 నుంచి 'కథాసాహితి' సహ సంపాదకులుగా, కవితా! ఓ కవితా! (1994), విస్మ ృత కథ (1998), రైతు కవిత (2004), గేయకవిత (2018) మొదలైన సంకలనాలకు ముఖ్య సంపాదకులుగా వ్యవహరించారు.
ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు (1985), డా. సి.నారాయణరెడ్డి కవితా పురస్కారం (1999), తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (1999), రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు (2003), నవ్యాంధ్ర రాష్ట్ర ఉగాది విశిష్ట పురస్కారం (2015), ఉత్తమ జాతీయకవి సత్కారం (2017), మహాకవి జాషువ పురస్కారం (2017) మొదలైన అనేక పురస్కారాలు పొందారు.
'సాహిత్యం - మౌలిక భావనలు' అనే ప్రస్తుత సిద్ధాంత గ్రంథం (1989) ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంనుంచి ఉత్తమ పరిశోధనగా స్వర్ణపతకం పొందింది.

Description

డా|| పాపినేని శివశంకర్‌
పేజీలు : 216
వెల : 170/-

Reviews

There are no reviews yet.

Be the first to review “సాహిత్యం – మౌలిక భావనలు”

Your email address will not be published. Required fields are marked *