ప్రజాకవి వేమన

 300

డా|| ఎన్‌. గోపి వేమనపరిశోధకుల్లో అగ్రగణ్యులు. 'వేమనగోపి'గా ప్రసిద్ధులు. ప్రస్తుత 'ప్రజాకవి వేమన' 1980లో వెలువడిన వారి పిహెచ్‌.డి. సిద్ధాంత గ్రంథం. 5 పునర్ముద్రణలు పొంది ఇప్పటికీ వన్నె తరగని ప్రామాణిక కృషిగా కొనసాగుతున్నది. ఇదేకాక గోపిగారు వేమనను గురించిన 'వేమన్నవాదం', 'వ్యాసనవమి', 'వేమన పద్యాలు' (ప్యారిస్‌ ప్రతి), 'వేమన్న వెలుగులు' వంటి గ్రంథాలను వెలువరించారు. గోపిగారు వస్తుత:కవి. వారు రచించిన మొత్తం 50 గ్రంథాల్లో 21 కవితా సంపుటాలు, 7 విమర్శా వ్యాస సంపుటాలు, 3 పరిశోధన గ్రంథాలు, 5 యాత్రా చరిత్రలు, 5 అనువాద గ్రంథాలు, 2 వ్యాఖ్యానాలు, 3 శీర్షికా ధారావాహికలు (జశీశ్రీబఎఅ ఔతీఱ్‌ఱఅస్త్రర), 2 ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, 2 వయోజన విద్యావాచకాలు ఉన్నాయి. 'జలగీతం' గోపిగారి ప్రఖ్యాత వైజ్ఞానిక, మానవీయ దీర్ఘకవిత. రెండు దశాబ్దాల క్రితం 'నానీ' అనే కవితా రూపప్రక్రియను సృష్టించి 'నానీల నాన్న'గా పేరొందారు. వీరి నానీలను అనుసరిస్తూ నేటివరకు 300 నానీల సంపుటాలు వెలువడి, వాటిని ట్రెండ్‌సెట్టర్‌గా నిలిపాయి. వీరి కవిత్వానికి 35 సాహిత్య పురస్కారాలతోపాటు, 'కాలాన్ని నిద్రపోనివ్వను' అనే కవితాసంపుటికి 2000 సంవత్సరంలో 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' లభించింది. వీరి కవిత్వం పలుభాషల్లోకి అనువాదమైంది. జలగీతం 13 భాషల్లోకి, నానీలు 12 భాషల్లోకి, కాలాన్ని నిద్రపోనివ్వను 23 భాషల్లోకి అనువాదమైనాయి. వీటిలో పర్షియన్‌, రష్యన్‌, జర్మనీ వంటి విదేశీ భాషలు కూడా ఉన్నాయి. 25-06-1948న నల్లగొండ జిల్లా భువనగిరిలో జన్మించిన గోపిగారు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్శవిద్యాలయం వైస్‌-ఛాన్స్‌లర్‌గా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పదవీ విరమణ చేశారు. నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా సలహా సంఘ సభ్యులుగా, సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి సంచాలకులుగా, కార్యనిర్వాహక సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం యు.జి.సి. ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
SKU: పరిశోధన గ్రంథం Categories: , ,

Description


పేజీలు : 408
వెల : 300/-

Reviews

There are no reviews yet.

Be the first to review “ప్రజాకవి వేమన”

Your email address will not be published. Required fields are marked *