సంఘసంస్కరణ దస్తూరి మన కందుకూరి
₹270.00
పేజీలు : 336
కవీ ప్రవక్తా కాలం కన్నా ముందుంటారు అన్నారు గురజాడ. అలా ఉండే వాళ్లు కొందరే, అందరూ ఉండరు. కందుకూరి తన కాలం కన్నా ముందుండిన రచయిత. అందరూ నిద్రపోతుంటే నిద్ర లేపేవాళ్ళు, స్తబ్దంగా ఉన్న సమాజంలో చలనం తీసుకొచ్చేవాళ్ళు వైతాళికులు. కందుకూరి అలాంటి వైతాళికుడు. దేనినైనా గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించి నిగ్గు తేల్చాలని నమ్మేవాళ్ళు శాస్త్రీయవాదులు. కందుకూరి అలాంటి శాస్త్రీయవాది. ఉద్యమంలో ఎదురయ్యే ప్రతిబంధకాలకు ఎదురొడ్డి నిలిచే వారే అసలైన ఉద్యమకారులు. కందుకూరి అలాంటి ఉద్యమకారుడు. తాత్వికమౌఢ్యం, సాంఘిక వివక్ష, ఆర్థిక అసమానత్వం రాజకీయ బానిసత్వం – ఇవి ఏ సమాజంలోనైనా ఉండే సమస్యలు. కందుకూరి మొదటి రెండింటి విూద ఉద్యమించారు. జీవితమంతా ఉద్యమవాదిగా నిలిచినా కొన్ని అంశాలలో ఆయన నైతికవాదిగా ఉండిపోయారు. అయినా నూరేళ్ళ క్రితం బతికిన కందుకూరి అనేకాంశాలలో తన కాలంకన్నా ముందున్నారన్నది వాస్తవం.
Reviews
There are no reviews yet.